వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామ శివారులోని పొదల్లో సుమారు 60 ఏళ్ల వృద్ధురాలి గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో జడ్చర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం కొంతవరకు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతురాలు నీలి రంగు జాకెట్, పసుపు-పచ్చ రంగు డిజైన్ ఉన్న చీర ధరించి ఉన్నట్లు వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

