వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా మామడ మండలం కోరిటికలు గ్రామంలోని గుర్రపుకుంట చెరువుకు గండి పడటంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సర్పంచ్ మోతే రాజేశ్వర్ జేసీబీ, గ్రామస్తుల సహాయంతో గండి పూడ్చే చర్యలు చేపట్టారు.
చెరువుకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని, గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్పంచ్ తెలిపారు. ఏ సమస్య వచ్చినా గ్రామస్తుల సహకారంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

