వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గుర్ల ఎంపీపీ పోట్నూరు ప్రమీల అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వ్యవసాయం, వైద్యం, విద్య, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, అంగన్వాడీ, ఉపాధి హామీ పథకం తదితర శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించారు.
Comments
Loading comments...

