వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావంతో గురజాల పరిసర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ముందస్తు చర్యల్లో భాగంగా మండలంలోని పాఠశాలలకు సోమ, మంగళవారాల్లో అధికారులు సెలవులు ప్రకటించారు. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

