వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందల్వాయి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇందల్వాయి సమీపంలోని గుంతలో పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

