వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నగరంలో ఈనెల 17 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు సీఎంవో హెచ్ డాక్టర్ శాంతికళ తెలిపారు. కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాలతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
వ్యాపారులకు అవగాహన కల్పించాలని, నిబంధనలు తప్పి ప్లాస్టిక్ వాడితే జరిమానాలు విధించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం మెరుగుకు వాహనాలు, సిబ్బందిని కేటాయించామన్నారు.
Comments
Loading comments...

