వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డులకు కేటాయించిన ఈ-ఆటోలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఈ-ఆటో ద్వారా రోజుకు కనీసం 1000 ఇళ్ల నుంచి తప్పనిసరిగా చెత్తను సేకరించాలని తేల్చి చెప్పారు.
బుధవారం ఆయన శ్యామలా నగర్, రాజేంద్ర నగర్, గార్డెన్స్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, ఈ-ఆటోల ద్వారా జరుగుతున్న ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
Comments
Loading comments...

