Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మెడికల్ కాలేజీలో అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 6:36 PM గుంటూరుGeneral
గుంటూరు మెడికల్ కాలేజీలో అవగాహన కార్యక్రమం - Udayam
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈనెల 29వ తేదీన 'గుడ్ క్లినికల్ ప్రాక్టీస్' అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సుందరాచారి వెల్లడించారు. ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో అనాటమీలోని ధన్వంతరి హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ శ్రీధర్, వైద్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...