వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు మండలం గుండ్లపల్లి–2 ఉత్తరగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన మురుగునీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు పెరగడంతో పాటు తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు తెలిపారు.
రెండు నెలలుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. మురుగునీరు తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

