వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ ఫైర్ స్టేషన్ అధికారి నాగు అనిల్‌కుమార్ శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. 2008 బ్యాచ్‌లో డ్రైవర్‌గా విధుల్లో చేరిన ఆయన స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా ఎదిగారు.
రెండేళ్లుగా వేములవాడలో విధులు నిర్వహిస్తూ పలు ప్రమాదాల సమయంలో ప్రాణాలు మరియు ఆస్తి నష్టాలను నివారించేందుకు కృషి చేశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు సహచరులు మరియు స్థానికుల్లో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

