వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా ముస్లిం మైనార్టీ విభాగం మాజీ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ గుండెపోటుతో కన్నుమూశారు. నగరానికి చెందిన తాజుద్దీన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతుండగానే గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఆయన మరణంతో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

