వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మండలం గుడివాడ హౌసింగ్ కాలనీని వర్షపు నీరు ముంచెత్తింది. సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నీరు నిల్వ ఉండటంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని సీపీఎం తెనాలి కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి హెచ్చరించారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి మురుగునీటిని మళ్లించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

