Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిలో విద్యార్థులకు బడి పాఠాలు

Follow Udayam on Google
babu varun Aug 25, 2026 6:43 PM రాజన్న సిరిసిల్లGeneral
గుడిలో విద్యార్థులకు బడి పాఠాలు - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సరిపడా గదులు లేక ఉపాధ్యాయులు విద్యార్థులకు గుడిలో పాఠాలు చెబుతున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో రెండు గదులు ఉన్నాయి. ఒక గది శిధిలావాస్తుకు చేరడంతో కూలిపోయింది. ఉన్న ఒక్క గదిలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సరిపోవడం లేదు. దీంతో పక్కనే ఉన్న గుడిలో తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాల భవనాన్ని నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...