Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గ భవాని ఆలయానికి భూమి పూజ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:52 PM సంగారెడ్డిGeneral
దుర్గ భవాని ఆలయానికి భూమి పూజ - Udayam
కొండాపూర్ మండలం సి.కోనాపూర్ గ్రామంలో శ్రీ దుర్గ భవాని ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. గ్రామ పెద్దలు, సర్పంచ్ మహేశ్వరి కోరిక మేరకు మహేశ్వర్ శర్మ సిద్ధాంతి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్మాణం పూర్తయితే గ్రామానికి ఎంతో మంచి జరుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...