Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లైన 18 రోజులకే నవ వరుడు మృతి

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:32 AM కామరెడ్డిGeneral
పెళ్లైన 18 రోజులకే నవ వరుడు మృతి - Udayam
నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూర్‌లో పెళ్లైన 18 రోజులకే 21 ఏళ్ల నవ వరుడు సంధిల భాను ప్రకాశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివారులోని పూరిగుడిసెలో ఉరేసుకుని మృతి చెందినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ నెల 7న వివాహం జరగగా, వైవాహిక జీవితం కొనసాగించేందుకు భార్య ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...