Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరింగలో పచ్చ పాము

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 30, 2026 8:10 AM కాకినాడGeneral
కోరింగలో పచ్చ పాము - Udayam
కాకినాడ జిల్లా కోరింగ అభయారణయంలోని చొల్లంగి పర్యాటక కేంద్రంలో అరుదైన పిట్‌ వైపర్‌ పాము కనిపించింది. ఆకుల్లో కలిసిపోయేలా పచ్చరంగులో ఉండే ఈ పాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పగటిపూట చెట్లపై నిద్రించే ఈ పాము రాత్రివేళ కీటకాలను వేటాడుతుందని అటవీ అధికారులు తెలిపారు. మడ అడవుల్లో వీటి సంచారం ఎక్కువగా ఉంటుందని, కాటు ప్రమాదకరమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...