Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమలబావితండాకు బీటీ రోడ్డు కావాలి

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 9:48 AM జనగామ General
చీమలబావితండాకు బీటీ రోడ్డు కావాలి - Udayam
చీమలబావితండా నుంచి మాదాపురం ఎక్స్‌రోడ్డు వరకు కొత్త బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దశాబ్దాలుగా సరైన రహదారి లేక తండా, విస్నూర్‌ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీటీ రోడ్డు నిర్మిస్తే రాకపోకలు సులభతరమై చిరకాల సమస్య పరిష్కారమవుతుందని వారు పేర్కొన్నారు. పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వారు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...