వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టిన కొన్ని గంటల్లోనే మనవరాలు మృతి చెందగా, మృతదేహాన్ని చూసేందుకు వస్తున్న తాత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ముత్యాలపల్లికి చెందిన కొప్పనాతి ఏడుకొండలు (46) గురువారం బైక్‌పై నరసాపురం వస్తుండగా రుస్తుంబాద వద్ద ఆవు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు.
తీవ్రంగా గాయపడిన ఏడుకొండలను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

