వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ మాసం సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్ల ఆలయంలో శనివారం తిరుప్పావడ సేవను వైభవంగా నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండేందుకు నిర్వహించే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ సేవ అంటారని అర్చకులు తెలిపారు.
దాతలు సుమారు 150 కిలోల వివిధ రకాల అన్నప్రసాదాలను స్వామివారికి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
Comments
Loading comments...

