Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ సమస్యల పరిష్కారానికి సర్పంచుల వినతి

Follow Udayam on Google
Harika Sep 29, 2026 5:23 PM జోగులాంబ గద్వాల్ General
గ్రామ సమస్యల పరిష్కారానికి సర్పంచుల వినతి - Udayam
అయిజ మండలంలోని గ్రామాల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని వివిధ గ్రామాల సర్పంచులు కోరారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బడే సాబ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో గడ్డం కృష్ణయ్యకు వినతిపత్రం అందించారు. సర్పంచులకు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులకు సహకరించాలని ఎంపీడీవోను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సుధాకర్‌గౌడ్‌, తిమోతి, కృష్ణ, నరసింహులు, ఆంజనేయులు, శివప్ప పాల్గొన్నారు.

Comments

G
Loading comments...