వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలను BRS ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలంగాణ భవన్‌లో వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నేతలతో వరుసగా సమావేశమయ్యారు.
అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు
Comments
Loading comments...

