Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై 20 వేల ఉత్తరాలు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 11:40 AM మహబూబ్‌నగర్తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై 20 వేల ఉత్తరాలు - Udayam
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల కోసం ‘డయల్ యువర్ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ఆరు జిల్లాల్లోని 136 పాఠశాలల విద్యార్థులు సమస్యలను ప్రస్తావిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 20 వేల ఉత్తరాలు పంపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 86 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు, ల్యాబ్‌ల కొరతను ఉత్తరాల్లో ప్రస్తావించారు.

Comments

G
Loading comments...