Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ సేవలు

Follow Udayam Digital on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 3:16 PM హైదరాబాద్తెలంగాణ
సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ సేవలు - Udayam Digital
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో టీ-ఫైబర్ విస్తరణపై సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని నిలిపివేసి, ప్రభుత్వ విభాగాలను టీ-ఫైబర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...