వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండలం గోవిందుపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా గర్భిణులకు శుక్రవారం శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. సూపర్‌వైజర్ జానకి మాట్లాడుతూ గర్భధారణ నుంచి శిశువు పుట్టిన తర్వాత తొలి 1,000 రోజులు కీలకమని, తల్లీబిడ్డలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు.
కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, ఉపసర్పంచ్ అశోక్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు సరోజ, పద్మ, ఆశా వర్కర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Loading comments...

