వార్తలకు తిరిగి వెళ్లండి

గోరికొత్తపల్లి మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా జాగృతి అధ్యక్షుడు గుమ్మడి రవీందర్ తెలిపారు. బొడ్రాయి వద్ద జరిగే వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
అందమైన బతుకమ్మలతో పాల్గొనే ఆడబిడ్డలకు ఐదు ప్రత్యేక బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. పాటలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

