వార్తలకు తిరిగి వెళ్లండి

గోరికొత్తపల్లి మండలంలోని ఎస్సారెస్పీ కాలువల్లో చెత్త, చెట్లు పేరుకుపోయి కొన్ని చోట్ల కాలువలు దెబ్బతిన్నాయి. తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో డీబీఎం-38 ద్వారా నీటిని విడుదల చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిచ్చిమొక్కలు, చెట్లతో కాలువలు ధ్వంసమయ్యాయని, పంటలకు నీరు ఎలా చేరుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

