వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీవో గోవిందుకు వినతిపత్రం అందజేశారు. జేఏసీ పిలుపు మేరకు అధ్యక్షుడు గల్లా రాజు, కార్యదర్శి గుమ్మడి చినబేబీ నేతృత్వంలో ఈ వినతి సమర్పించారు.
కనీస వేతనం రూ.26 వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎఫ్‌టీఈను పూర్తిస్థాయిలో అమలు చేయడంతోపాటు డివిజన్, మండల స్థాయిలో బదిలీలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

