వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండల కేంద్రంలో విజయదశమి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్న దసరా ఉత్సవాల కోసం గురువారం విద్యుత్ అలంకరణ పనులు చేపట్టారు.
25 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం రంగస్థల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Comments
Loading comments...

