వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండలం కామరాజుపేట గ్రామ పరిధిలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో జగ్గంపేటకు చెందిన వాసంశెట్టి ఆనంద్ (20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

