వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచరిస్తోందన్న ప్రచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పలు గ్రామాల్లో పులి అడుగుజాడలు గుర్తించామన్న సమాచారంతో అటవీ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, పుకార్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రివేళల్లో పొలాలకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.
Comments
Loading comments...

