వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లయిన 41 రోజులకే నవవధువు లావణ్య (25) దుర్మరణం చెందింది. చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలోని మలక్‌పేట డిమార్ట్ సిగ్నల్ వద్ద ఆటో ఢీకొనడంతో దంపతులు రోడ్డుపై పడిపోయారు.
అదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి లావణ్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్త కళ్లెదుటే ఈ ప్రమాదం జరగడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

