Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైనైడ్ తిని రెండేళ్ల చిన్నారి మృతి: జీడిమెట్లలో విషాదం

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:18 AM హైదరాబాద్General
సైనైడ్ తిని రెండేళ్ల చిన్నారి మృతి: జీడిమెట్లలో విషాదం - Udayam
బంగారు నగల తయారీలో వాడే సైనైడ్‌ను ముట్టుకుని, వేళ్లను నోట్లో పెట్టుకోవడంతో రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురై మృతిచెందింది. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని చింతల్ శ్రీనివాస్ నగర్‌లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి జ్యువెలరీ షాప్‌కు వెళ్లిన క్రమంలో చిన్నారి ప్రమాదవశాత్తు సైనైడ్‌ను తాకినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...