వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్ మండలం గొల్లూరుగూడెంలో గుండెపోటుతో మృతి చెందిన పగడాల రాంరెడ్డి మృతదేహానికి మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆయన, రాంరెడ్డి కుమారులు మధుసూదన్ రెడ్డి, సురేందర్ రెడ్డి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాంరెడ్డి అకాల మరణం పట్ల అవినాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

