వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీ అధికారులమంటూ నకిలీ ఫోన్ కాల్స్‌తో కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సైబర్ నేరగాళ్లు భయానక వాతావరణం సృష్టించారు. తహసీల్దార్, వీఆర్వోలు సహా పలువురు అధికారులను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ కేటుగాళ్ల వలలో చిక్కుకున్న వీఆర్వో వెంకటపతి ఫోన్ పే ద్వారా రూ.1.30 లక్షలు పోగొట్టుకున్నారు. మోసపోయినట్లు గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

