వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పలు రోడ్లు కొట్టుకుపోయాయి. జీకేవీధి మండలం గొల్లపల్లి-నడుం వీధి మధ్య కాలువపై రోడ్డు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
దీంతో గొల్లపల్లి గిరిజనులు గురువారం సమష్టిగా కాలువలో రాళ్లు వేస్తూ తాత్కాలిక దారి ఏర్పాటు చేసుకునేందుకు శ్రమించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారితో రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Loading comments...

