వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండ మండలంలో ఈ నెల 29న జరగనున్న విద్యా కమిటీ (SMC) ఎన్నికలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మండలంలో 59 పాఠశాలలు ఉండగా 49 ప్రాథమిక, 8 ఉన్నత పాఠశాలలు, అంబేడ్కర్ గురుకులం, కస్తూర్బా పాఠశాల ఉన్నాయి.
ఎన్నికల విధివిధానాలను అధికారులు పాఠశాలలకు సిద్ధం చేశారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపికపై కూటమి నాయకులు కసరత్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

