Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారు గని కూలి 30 మంది మృతి

Follow Udayam on Google
జయ Aug 19, 2026 7:53 AM ఆల్ ఇండియా జాతీయ
బంగారు గని కూలి 30 మంది మృతి - Udayam
సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లోని నానా-మంబేరే ప్రావిన్స్‌ అబ్బా ప్రాంతంలో బంగారు గని కూలిపోవడంతో 30 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సహాయక సిబ్బంది శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. మరికొందరు కార్మికులు మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి ప్రకటించింది.

Comments

G
Loading comments...