Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారికి బంగారు గాజుల విరాళం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 24, 2026 6:46 AM నంద్యాలGeneral
అమ్మవారికి బంగారు గాజుల విరాళం - Udayam
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు తమ భక్తిని చాటుకున్నారు. వారు శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి రూ.27 లక్షల విలువైన 186 గ్రాముల బరువు గల బంగారు గాజులను బహుకరించారు. దీంతోపాటు ఆలయంలోని నిత్యాన్నదాన ట్రస్టు కోసం మరో రూ.3 లక్షల నగదును విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ శ్రీనివాసరావు దాతలకు స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...