Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేరూరు వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 31, 2026 11:33 AM ములుగు General
పేరూరు వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం - Udayam
ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాజేడు మండలం పేరూరు వద్ద గురువారం రాత్రికి నీటిమట్టం 51.33 అడుగులకు చేరింది. వాగులు పొంగి నదిలో కలుస్తున్నాయి. టేకులగూడెం సమీపంలో వరద నీరు రహదారిపైకి చేరడంతో హైదరాబాద్‌-భూపాలపట్నం జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...