Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

Follow Udayam on Google
Udayam News Reporter Sep 15, 2026 11:52 AM జగిత్యాలGeneral
గణపతి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి - Udayam
నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్‌ఐ పాకాల గీతా సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్ మండపాల నిర్వాహకులు, సంఘాల సభ్యులకు పోలీసులు అవగాహన కల్పించారు. మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని, డీజేలు, అధిక శబ్దాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, రెచ్చగొట్టే సోషల్‌ మీడియా పోస్టులు చేయరాదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...