వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం హైస్కూల్ సెంటర్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద మంగళవారం గణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు గిరి శర్మ, బాబు శర్మ, బాబ్జి శర్మతో పాటు పలువురు వేద పండితుల ఆధ్వర్యంలో హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మండలంలో గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో హోమం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

