Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనంలో డీజేలకు స్వస్తి పలకాలి

Follow Udayam on Google
Devender Bale Sep 23, 2026 5:01 PM జగిత్యాలతెలంగాణ
గణేష్ నిమజ్జనంలో డీజేలకు స్వస్తి పలకాలి - Udayam
గణేష్ నిమజ్జన శోభాయాత్రల్లో డీజేలు, అధిక శబ్దాన్ని నివారించి భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి కోరారు. అధిక శబ్దం, డీజేలతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. డీజేలకు బదులుగా భజనలు, భక్తి గీతాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నిమజ్జన వేడుకలు నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...