వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండలంలో గణేష్ మండపాల ఏర్పాటుకు 40 దరఖాస్తులు వచ్చాయని ఎస్సై మహేందర్ తెలిపారు. వివిధ గ్రామాల్లో 40 మండపాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
మండపాల భద్రత బాధ్యత నిర్వాహకులపైనే ఉంటుందని ఎస్సై స్పష్టం చేశారు. భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు ఫోన్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

