వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి: గన్నారం బీట్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో అక్రమంగా చెట్లు నరికిన ఘటనపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
తనిఖీల్లో సుమారు 5 టేకు, 3 చెన్నంగి చెట్లు నరికివేసినట్లు గుర్తించి, గన్నారం గ్రామానికి చెందిన కుంట లక్ష్మణరెడ్డిపై అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకున్నారు. అక్రమంగా చెట్లను నరికినా, అటవీ సంపదకు నష్టం కలిగించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

