Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి

Follow Udayam on Google
babu varun Aug 07, 2026 3:58 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేట ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమం నిర్వహించేందుకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10న ప్రతి ఇంటిపై ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. దేశభక్తి భావనను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...