Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
B RAJESH Sep 04, 2026 1:36 PM విజయనగరంGeneral
గజపతినగరం రైల్వే స్టేషన్లో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. బొబ్బిలి సబ్డివిజన్ పోలీసులతో పాటు ఆర్పీఎఫ్, ఈగల్ టీం సిబ్బంది సంయుక్తంగా ఒడిశా నుంచి విజయనగరం వైపు రాకపోకలు సాగిస్తున్న పలు రైళ్ల బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల లగేజీ, అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...