వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లా గరుగుబిల్లి మండలం మధుర శివరాంపురంలో ఓ బాలిక (15) ప్రమాదవశాత్తు తోటపల్లి కాలువలో జారిపడి మృతి చెందింది. సోమవారం బట్టలు ఉతికేందుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

