Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Follow Udayam on Google
p.g.murthy Sep 05, 2026 10:50 AM మంచిర్యాలGeneral
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - Udayam
దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శనివారం ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు నివాళి అర్పించారు. కాగా గుడిరేవు పాఠశాలలో ఉపాధ్యాయులకు విద్యార్థులు పూలు ఇచ్చి అభినందనలు తెలిపారు. పలు గ్రామాల్లో కూడా ఉపాధ్యాయులను స్థానికులు సన్మానించారు.

Comments

G
Loading comments...