వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: ప్రజానాట్యమండలి, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ నాయకులు, కాశీ విశ్వనాథ్ ప్రథమ వర్ధంతిని బుధవారం పత్తికొండలో నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
నాయకులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పేద ప్రజలు, కార్మికులు, విద్యార్థుల సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నివాళి అన్నారు.
Comments
Loading comments...

