వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో రాయికల్ మండలంలోని పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం గణనాథుడిని ఊరేగింపుగా నిమజ్జన ప్రదేశాలకు తరలించారు.
డప్పు చప్పుళ్లు, భక్తి గీతాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో శోభాయాత్రలు ఉత్సాహంగా సాగాయి. పోలీసులు, అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Comments
Loading comments...

